అయ్యన్నకు మతి చలించింది.. గంటాది ఐరన్ లెగ్
విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య నువ్వా? నేనా? అనేలా మాటల యుద్ధం కొనసాగుతోంది. అగనంపూడిలో టాటా సంస్థ నిర్మిస్తున్న కేన్సర్ ఆసుపత్రికి మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకి మతి చలించిందని, అందువల్లే ఆయన తనపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి సమాధానంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంటా ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ మటాష్ అన్నారు. గంటాది ఐరన్ లెగ్ అని, అందుకే ప్రజారాజ్యంలోకి వెళ్తే అది మూత పడిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు అని అన్నారు.